ప్రొటీన్లు శాఖాహారంలో వుండవా.?

- May 29, 2023 , by Maagulf
ప్రొటీన్లు శాఖాహారంలో వుండవా.?

శరీరం ఎదుగుదల, సరైన నిర్మాణం కోసం తీసుకునే ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారమైన చికెన్, మటన్, ఫిష్ తదితర నాన్ వెజ్ ఐటెమ్స్‌లోనే ఎక్కువగా వుంటాయని చెబుతుంటారు. శరీరానికి తగిన ప్రొటీన్లు అందాలంటే ఆయా మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు.

మరి, శాఖాహారుల విషయంలో ప్రొటీన్ల సంగతేంటీ.? వారు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా లభించవా.? ఒకవేళ లభిస్తే.. ఎక్కువగా ప్రొటీన్లు వుండే శాఖాహారం ఏంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.

శాఖాహారంలోనూ ప్రొటీన్లు అధికంగా లభించే ఆహార పదార్ధాలుంటాయ్. ఆకుకూరల్లో ఎక్కువగా పాలకూరలో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయ్. అలాగే కాలి ఫ్లవర్, బ్రొకోలీలలోనూ అధిక శాతం ప్రొటీన్లు దాగి వుంటాయ్.

శాఖాహారుల మాంసంగా పిలవబడే పుట్టగొడుగులు (మష్రూమ్స్)లోనూ ప్రొటీన్ల శాతం అధికం. చూడ్డానికి కాలి ఫ్లవర్‌లా కనిపించే బ్రొకోలీ అత్యధికమైన ప్రొటీన్ వుండే కూరగాయగా చెబుతారు. ఇది శాఖాహారుల డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావల్సినంత ప్రొటీన్ రావడంతో పాటూ, ఎముకల్ని బలంగా వుంచడంలోనూ తోడ్పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com