ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..

- May 29, 2023 , by Maagulf
ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..

అహ్మ‌దాబాద్: టీం ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని ఐపీఎల్‌(IPL)లో స‌రికొత్త‌ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌డం ద్వారా ధోని ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆట‌గాడు కూడా ఐపీఎల్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడ‌లేదు. ధోని ఐపీఎల్‌లో 39.09 సగటుతో 135.96 స్ట్రైక్ రేట్‌తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 84*. 239 సిక్స‌ర్లు, 329 ఫోర్లు బాదాడు. కీప‌ర్‌గా 141 ఔట్ల‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో ధోని త‌రువాత ముంబైఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. ఇంకా ఈ జాబితాలో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే?

మ‌హేంద్ర సింగ్ ధోని – 250
రోహిత్ శ‌ర్మ – 243
దినేశ్ కార్తిక్ – 242
విరాట్ కోహ్లి – 237
ర‌వీంద్ర జ‌డేజా- 225
శిఖ‌ర్ ధావ‌న్ – 217
సురేశ్ రైనా – 205
రాబిన్ ఉత‌ప్ప – 205
అంబ‌టి రాయుడు -203
అశ్విన్‌- 197

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com