లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- May 29, 2023
లండన్: NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా ఎన్.టి.ఆర్ శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి.ఈ సందర్బంగా ఎన్.టి.ఆర్ విగ్రహావిష్కరణ మరియు 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వినాయక శ్లోకంతో మొదలయిన కార్యక్రమం, ఎన్.టి.ఆర్ తో అనుబంధం ఉండి పెద్దయనతో కలిసి పనిచేసిన లండన్ సీనియర డాక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్.టి.ఆర్ తో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు.ఒక నటుడిగా మొదలయి తెలుగు జాతి ఇలావేల్పుగా ఎన్.టి.ఆర్ ఎదిగిన ప్రస్థానంలో తమకు ఎదురైన అనుభూతుల్ని పంచుకున్నారు.1000 కి మందికి పైగా హాజరైన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 8 వరకు ఆహుతుల్ని కట్టిపడేసింది.అన్నగారి జీవిత విశేషాలలు,ఆయన సాధించిన విజయాలు, తెలుగు జాతికి అందించిన ఫలాల వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ ఆహుతల్ని విశేషంగా ఆకట్టుకుంది...కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, అన్నగారి పాటలతో కూడిన Medley డాన్స్ యువతని ఉర్రూతలూగించింది.తెలుగు సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు నేలని లండన్లో ఆవిష్కరింప చేసినట్లుంది..NTR ఆశయాలు,ఆలోచినల్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన స్పూర్తితో నేటి తరం మరిన్ని విజయాల్ని అందుకునే లా ప్రజల్లో చైతన్యం నింపటం కోసం NRI TDP UK చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాలికని ఈ సందర్బంగా పంచుకున్నారు.అన్నగారు ఇచ్చిన ఆత్మ గౌరవం నుంచి చంద్రబాబు గారి నింపిన ఆత్మ విశ్వాసం వరకు తెలుగుజాతి ప్రస్థానం మీద చేసిన ప్రసంగాలు యువతని ఉర్రూతలూగించాయి..ఈ సందర్బంగా అన్నగారి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆక్షరనగా నిలిచింది.ఈ సందర్భంగా తెలుగు రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు వేడుకలకి మరింత పండగ శోభని అద్దాయి.
తెలుగు ప్రజల అస్తిత్వానికి సూచిక అయిన అన్నగారి శత జయంతి వేడుకలకి UK వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ మొట్టమొదటి సారి ఏకతాటి మీదకి రావటం శుభసూచకం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన.పంజాబీ డోలే నృత్యాలు, బాణా సంచా వేడుకలు & శత జయంతికి సూచికగా 100 NTR ఆకారంలో అభిమానులు చేసిన.మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో ఎన్.టి.ఆర్ శతజయంతి వేడుకలు, టీడీపీ మినీ మహానాడు వేడుకలు అంబరాన్ని అంటాయి.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు