అల్లు శిరీష్ కొత్త ప్రయోగం.! వర్కవుట్ అయ్యేనా.?
- May 30, 2023
అన్న అల్లు అర్జున్ బాటలోనే తాను కూడా హీరోగా తెరంగేట్రం చేశాడు అల్లు శిరీష్. హీరోగా అల్లు వారబ్బాయ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావస్తున్నా.. తనకంటూ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు.
బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు రావడంతో కొన్నాళ్లు యాక్టింగ్ నుంచి తప్పుకున్నాడు. నిర్మాణంపై ఫోకస్ పెట్టాలనుకున్నాడు. కానీ, మళ్లీ వచ్చాడు.
‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన శిరీష్‌కి అది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ, బలవంతంగా ఈ సినిమాతో హిట్టు అనిపించేసుకున్నాడంతే.
ఇక, ఇప్పుడు ఇంకో ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సారి ఓ టెడ్డీ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు అల్లు శిరీష్. అందుకు సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
ఇదే తన నుంచి రాబోయే కొత్త ప్రాజెక్ట్ అని అయితే హింట్ ఇచ్చాడు కానీ, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.! త్వరలోనే పూర్తి వివరాలతో మళ్లీ వస్తా.. అని ప్రకటించాడు. చూడాలి మరి, అల్లు వారబ్బాయ్ ఈ సరికొత్త ప్రయోగాన్ని ఎలా వర్కవుట్ చేస్తాడో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







