Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు

- May 30, 2023 , by Maagulf
Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు

యూఏఈ: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత ప్రవాసుడు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ Idealz  డ్రాలో Dh2 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత రిను రాజ్ భారతదేశంలోని కేరళకు చెందినవారు. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య, చదువుకుంటున్న కుమారుడు ఉన్నారు. 50 దిర్హాలు పెట్టి డ్రాలో పాల్గొనగా.. అది అతన్ని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్‌గా చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com