సురక్షితంగా భూమికి తిరిగివచ్చిన సౌదీ వ్యోమగాములు

- May 31, 2023 , by Maagulf
సురక్షితంగా భూమికి తిరిగివచ్చిన సౌదీ వ్యోమగాములు

కేప్ కెనవెరల్: సౌదీ వ్యోమగాములు రేయానా బర్నావి,  అలీ అల్-కర్నీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పది రోజులు గడిపిన తర్వాత బుధవారం తెల్లవారుజామున భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు. కక్ష్యలో ఉన్న ల్యాబ్ నుండి అన్‌డాకింగ్ చేసిన 12 గంటల తర్వాత, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌కు దూరంగా మెక్సికో గల్ఫ్‌లోకి నలుగురితో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ దిగింది.

బర్నావి తన సహోద్యోగి అల్ ఖర్నీతో కలిసి గత సోమవారం ఆర్బిటల్ అవుట్‌పోస్ట్‌కు వెళ్లినప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్ళిన మొదటి అరబ్ మహిళగా రికార్డు సృష్టించింది. బర్నావి తన ప్రయోగాలను ముగించుకుని అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు సంతోషంగా ఉందని తెలిపింది. "ప్రతి కథ ముగింపుకు వస్తుంది. ఇది మన దేశానికి మరియు మన ప్రాంతానికి కొత్త శకానికి నాంది మాత్రమే" అని ఆమె పేర్కొన్నారు.

సౌదీ వ్యోమగాములతో పాటు రిటైర్డ్ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్,  జాన్ షాఫ్నర్ భూమికి క్షేమంగా తిరిగివచ్చారు. కక్ష్యలో ఉన్న ప్రయోగశాలలో ఉన్న సమయంలో, AX-2 వ్యోమగాములు 20కి పైగా STEAM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ మరియు మ్యాథమెటిక్స్) ఔట్‌రీచ్ ఎంగేజ్‌మెంట్‌లు,  మైక్రోగ్రావిటీలో 20 కంటే ఎక్కువ పరిశోధన అధ్యయనాలు, అలాగే ఎనిమిది మీడియా ఈవెంట్‌లను విజయవంతంగా పూర్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com