ఈ లక్షణాలుంటే ఫ్యాటీ లివర్ వున్నట్లే.! జర భద్రం సుమా.!
- May 31, 2023ఇటీవలి కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అందుకు కారణం నేటి లైఫ్ స్టైలే. ఎక్కువగా ఎలక్ర్టానిక్ డివైజ్‌లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు ఇలా అనేక రకాల కారణాలు ఫ్యాటీ లివర్ ఫేషెంట్లను పెంచేస్తున్నాయ్.
అసలు ఫ్యాటీ లివర్ అంటే.. కాలేయం చుట్టూ అసాధారణ కొవ్వు పెరిగిపోవడమే. ఫ్యాటీ లివర్ కారణంగా అసాధారణ కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, కాళ్లలో వాపులు, నీరసం, వికారం తదితర లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయ్.
ఆరంభంలోనే ఫ్యాటీ లివర్ని గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి ముదిరితే, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందని హెచ్చరిస్తున్నారు.
అయితే, దీన్నుంచి తప్పించుకోవాలంటే, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుండిపోవడం, శరీరానికి కదలిక లేకుండా చేయడం వంటి చేయకూడదు. అలాగే ఆల్కహాల్ అలవాటున్న వాళ్లు పూర్తిగా నియంత్రించాలి. ధూమపానం కూడా వదిలేయాలి. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదు. ఫ్రైడ్ ఐటెమ్స్ ఆహారంలో తగ్గించాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం