మనామా సౌక్‌ని ఆదుకోవాలి
- May 12, 2016
మనామా సౌక్ ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురుచూస్తోందనీ, ఉనికి కోసం పోరాడుతున్న మనామా సౌక్‌ని ప్రభుత్వం సబ్సిడీతో ఆదుకోవాలని మనామా ట్రెడిషనల్ మార్కెట్ డిప్యూటీ ఛైర్మన్ మహమూద్ అల్ నమిలిటి విజ్ఞప్తి చేశారు. సబ్సిడీల ఎత్తివేతతో మనామా సౌక్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందనీ, ఆర్థికంగా ఈ ఇబ్బందికర పరిస్థితుల కారణంగా చారిత్రక ప్రాముఖ్యం కలిగిన మనామా సౌక్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్‌పై సబ్సిడీ ఎత్తివేత మనామా సౌక్‌పై తీవ్ర ప్రభావం చూపిందని మహమూద్ చెప్పారు. యూఏఈ ఖతార్‌లలో ప్రభుత్వాలు 'సౌక్'లను ఆదుకుంటున్నాయని తద్వారా టూరిజం కేంద్రాలుగా అవి ఖ్యాతి గడిస్తున్నాయని చెప్పారు. బహ్రెయినీ సౌక్‌లు కూడా ఆ స్థాయి కలిగి ఉన్నా ప్రభుత్వం ఆదుకోని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉంటుందని మొహమూద్ అన్నారు. మనామా సౌక్‌లో పెట్టుబడులు పెడితే రెండింతలు అవుతాయనీ, తమ్‌కీన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







