వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన సిఎం జగన్

- June 02, 2023 , by Maagulf
వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన సిఎం జగన్

అమరావతి: సిఎం జగన్‌ నేడు వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 2,562 ట్రాక్టర్లను, 100 కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. వీటి విలువ రూ. 361.29 కోట్లు. వీటితో పాటు 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా పంపిణీ చేశారు. రైతుల గ్రూప్ ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీని జమ చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకే యంత్ర పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేల్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయని చెప్పారు. యంత్రాల కోసం ప్రతి ఆర్బీకే సెంటర్ కి రూ. 15 లక్షలు కేటాయించామని తెలిపారు. రైతులకు ఏం కావాలో వారినే అడిగి ఆర్బీఐ సెంటర్లలో అందిస్తామని చెప్పారు. అక్టోబర్ లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలను అందిస్తామని తెలిపారు. రైతులందరికీ మంచి జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com