కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే మీ డైట్‌లో వీటిని చేర్చుకోండి.!

- June 02, 2023 , by Maagulf
కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే మీ డైట్‌లో వీటిని చేర్చుకోండి.!

ఒకప్పుడు నలభయ్యేళ్లు పైబడిన వారిలోనే కంటి సమస్యలు తలెత్తేవి. కానీ, ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కంటి జబ్బులు తోడవుతున్నాయ్. అందుకు తీసుకునే ఆహారంలో వుండాల్సిన పోషకాలు సరిగా లేకపోవడం, మొబైల్ వాడకం, కంప్యూటర్ స్ర్కీనింగ్ ఎక్కువగా చూస్తుండడంతో పాటూ కాలుష్యం కూడా ఓ కారకమే.
అయితే, వాటన్నింటినీ మార్చడం సాధ్యం కాకపోయినా, వున్నంతలో కంటి చూపును మెరుగు చేసుకోవడానికి కనీసం కాపాడుకోవడానికి ప్రతీరోజూ తీసుకునే డైట్‌లో ఈ పదార్ధాలు వున్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి అని సంబంధింత వైద్యులు సూచిస్తున్నారు.
క్యారెట్ తింటే కంటి చూపుకు ఇబ్బంది వుండదు అని తెలిసిన సంగతే. క్యారెట్‌తో పాటూ పాలకూర కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
అలాగే బ్రొకోలీని పెద్దగా ఎవ్వరూ ఇష్టపడరు. కానీ, బ్రొకోలీలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉడికించిన చిలగడ దుంపలు, కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయ్. మాంసం కన్నా, చేపల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే శక్తి ఎక్కువగా వుంటుంది. అందుకే వారానికి ఓ సారైనా చేపలను మన మెనూలో చేర్చుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com