రామ్ గోపాల్ వర్మ గొప్పతనం అదే.!
- June 02, 2023
పబ్లిసిటీ కోసం ఎంత దూరమైనా పోతాడాయన. ఎంతకైనా దిగజారిపోతాడు కూడా. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన ఆయన, ఇప్పుడు ఆ సంచలనాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు.
ఆయన మరోవరో కాదు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మే. ఆయన తాజాగా ‘వ్యూహం’ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కి సంబంధించిన కాంట్రవర్షియల్ ఇతివృత్తాన్ని మూల వస్తువుగా తీసుకుని ఈ ‘వ్యూహం’కి కథ రచించేశారాయన. హా.! వర్మ సినిమాల్లో ఏముంటుందిలే.. అని లైట్ తీసుకుంటున్నారా.? మీ లైట్‌ని మేం కాదనలేం కానీ, ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకోకుండా వుండలేం.
పాత్రలు, పాత్ర ధారులు. తాజాగా ఆయన ‘వ్యూహం’ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో జగన్ ఆయన భార్య భారతి పాత్రలను చూపించారు.
అవి పాత్రలే కావచ్చు.. ఆ పాత్రల్లో రియల్ మనుషుల్ని అచ్చుగుద్దినట్లుగా దించేస్తుంటారాయన. రిలీజ్ చేసిన పోస్టర్లలో జగన్, ఆయన భార్య భారతిలను అచ్చు గుద్దినట్లుగా అలాగే దించేశారు. ఈ పోస్టర్ గురించి ఇదే చర్చ జరుగుతోంది. ‘రంగం’ ఫేమ్ అజ్మల్, ‘హైవే’ ఫేమ్ మానస రాధాకృష్ణ ఈ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది రిలీజ్ అయ్యే సినిమానేనా.? అని మాత్రం అడగొద్దు ప్లీజ్.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







