అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ఎప్పటిలాగే తేల్చేశాడే.!
- June 02, 2023
‘అహింస’ అంటూ తేజ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ సినిమాతో రాబోతున్నాడు. తేజ సినిమాల్లో కొత్తగా చూపించడానికేముంటుంది. ఓ రైలు బండి, రక్తంతో నిండిపోయిన హీరో, హీరోయిన్‌తో అరుపులు, పైశాచికత్వం.. ఇదే కదా. అదే కనిపించింది ‘అహింస’ పోస్టర్లలోనూ.
సినిమాలోనూ అదే వుంది కొత్తగా ఇంకేం లేదు అని తాజాగా జనం తేల్చేశారు. దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేశాడు డైరెక్టర్ తేజ ఈ సినిమాతో.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేయాల్సిన ఓవరాక్షన్ అంతా చేసేశాడు. అంత చేసినా సినిమాని మాత్రం కాపాడలేకపోయాడు. ఫస్ట్ డే టాకే సుత్తి, చెత్త.. అని తేలిపోయింది. ఇక, ఈ సినిమాని ఆదుకునే నాధుడింకెవరు.?
ప్రమోషన్ల పేరు చెప్పి జీవించి వున్నవాళ్లనీ, జీవించి లేని వాళ్లనీ (ఉదయ్ కిరణ్) కూడా తన డిస్కషన్స్‌లోకి తెచ్చేసి కాంట్రవర్సీ అయ్యాడు తేజ. ఆ కాంట్రవర్సీల మీద పెట్టిన దృష్టి, సినిమాని సక్సెస్ ఫుల్‌గా తెరకెక్కించడంలో పెట్టి వుంటే బాగుండేదని సినిమా చూశాకా ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేగా.! అంతేగా.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







