ఆశాజనకంగా యూఏఈ జాబ్ మార్కెట్..!
- June 03, 2023
యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో యూఏఈ జాబ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి కొన్ని రంగాలలో 20 శాతం పెరుగుదలతో అద్భుతమైన పురోగతిని సాధించాయి. రిక్రూటర్ల ప్రకారం.. దుబాయ్ ఆర్థికంగా ఎదుగుతూనే ఉందని, రిక్రూట్ మెంట్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమవుతుందని మార్క్ ఎల్లిస్లో జనరల్ మేనేజర్ అవ్స్ ఇస్మాయిల్ చెప్పారు. యూఏఈ ప్రభుత్వం చేపట్టిన డిజిటలైజేషన్ కూడా తమ వ్యాపార విస్తరణకు దోహదం చేసిందన్నారు. గత కొంత కాలంగా విదేశీ పెట్టుబడులు కూడా పెరిగాయని, 2023 చివరి వరకు ఇదే ఊపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా నైపుణ్యం, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ మరియు డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించే వారికి డిమాండ్ ఉందన్నారు.
గ్లోబల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ రాబర్ట్ వాల్టర్స్ ఇటీవలి నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ పరిశ్రమ ఉద్యోగ ఖాళీలలో 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. హెచ్ఆర్ రంగం గౌరవప్రదమైన 10 శాతం పెరుగుదలను నమోదుచేసింది. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ డెవలపర్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, IT ఇంజనీర్, DevOps ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాలకు డిమాండ్ ఉందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







