ఫ్రెంచ్ కేఫ్‌లో నివాసితులతో దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ సందడి
- June 04, 2023
యూఏఈ: దుబాయ్ పాలకుడు గత కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఎమిరేట్‌లోని దుబాయ్ హిల్స్ మాల్‌లో సందడి చేశారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి అయిన హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రసిద్ధ ఫ్రెంచ్ కేఫ్ లాడూరీలోకి వెళ్లి సందడి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్‌లో సందడి చేసిన విధంగానే దుబాయ్ రూలర్ క్యాజువల్‌గా ఫ్రెంచ్ కేఫ్‌లోకి అడుగుపెట్టి, సాధారణ కస్టమర్ వలె టేబుల్‌లో కూర్చున్నారు. దీంతో అక్కడి సిబ్బంది, కొందరు నివాసితులు ఆశ్చర్యపోయారు. షేక్ మహ్మద్ ఈ వీడియోను షేర్ చేసిన యూఏఈ మహిళ.. ప్రియమైన నాయకుడిని దగ్గరగా చూడగలిగిన తర్వాత తా అదృష్ట అమ్మాయిగా భావించానని తన సోషల్ మీడియా అకౌంట్లో చెప్పారు. సదరు వీడియోలోదుబాయ్ పాలకుడు నవ్వుతూ, ఉత్సాహంగా ఉన్న ఒక చిన్న అమ్మాయితో మాట్లాడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







