భారత్‌లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం
- June 04, 2023
కువైట్: ఒడిశాలో శుక్రవారం జరిగిన పెద్ద రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించిన ఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారతదేశానికి తన సానుభూతిని తెలిపింది. ఈ బాధాకరమైన ఘటనపై మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి, భారత ప్రభుత్వానికి.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరుకుందని భారతీయ రైల్వే శనివారం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారెవరినీ విడిచిపెట్టబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







