కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- June 04, 2023
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జూన్ 1న మూడు కొత్త బయోమెట్రిక్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో కువైటీలు, గల్ఫ్ దేశస్థుల కోసం కేటాయించిన మొత్తం బయోమెట్రిక్ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ కేంద్రాలు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కువైటీలు, GCC పౌరుల కోసం బయోమెట్రిక్ కేంద్రాలను హవలీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ముబారక్ అల్కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్, జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ లలో ఏర్పాటు చేశారు. నివాసితుల అలీ సబా అల్-సలేం, జహ్రా ప్రాంతాల్లో బయోమెట్రిక్ కేంద్రాలను నెలకొల్పారు.
పౌరులు, నివాసితులు తమ బయోమెట్రిక్ నమోదు కోసం ఈ కేంద్రాలలో సహేల్ యాప్ (మాతా ప్లాట్‌ఫారమ్) ద్వారా అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్, మీడియా డైరెక్టరేట్ జనరల్ వివరించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







