యూత్ కు కనెక్ట్ అయ్యే 'రాజుగారి కోడిపులావ్' ఇది కుటుంబ కథా 'వి'చిత్రం
- June 05, 2023
హైదరాబాద్: ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్" కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ చిత్రం నుంచి మొదటి అప్డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. రాజు గారి కోడిపులావ్ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ అలాగే సినిమా ఔట్ లైన్ కూడా తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ.. మూవీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మిగితా క్యారెక్టర్లను కూడా పరిచయం చేసారు. అందులో భాగంగా నేహా దేశ్ పాండే ఈ చిత్రంలో ఆకాంక్ష గా నటించారు. అలాగే బద్రి పాత్రను కునాల్ కౌశల్, క్యాండీ గా ప్రాచీ కెథర్, ఈషా పాత్రలో రమ్య దేష్, ఫరూక్ గా అభిలాష్ బండారి తదితరులు నటించారు.
రీయూనిన్ తో కలిసిన 6 మంది స్నేహితులు తాము ఒక రిఫ్రెష్ నెస్ కోసం సరదాగా గడపడానికి ఒక డెస్టినేషన్ (అడవిలో ఒక ప్రాంతానికి) ఎంచుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చేసే పోరాటమే రాజుగారి కోడిపులావ్. సినిమా టైటిల్ శీర్షిక చాలా అసక్తగా ఉన్నాయి. దీంతో పాటు విడుదలైన వీడియో కూడా చాలా ఆసక్తిని పెంచుతుంది.
చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో చూస్తుంటే సినిమా ఆద్యంతం క్రిమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అంతే కాకుండా అందమైన లవ్ స్టొరీ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ప్రేక్షకులకు ఉక్కిరిబిక్కిరి చేసే సీన్లు బోలెడు ఉన్నట్లు వీడియో చూస్తే స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సినిమాపై ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక సినిమా సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే మరో అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
నటీనటులు : శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు
బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
డైరెక్టర్ : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మణీ
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా
సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు
వీఎఫ్ ఎక్స్ : అండీ చంగ్
సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్
రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన
పీఆర్ఓ : హరీష్, దినేష్
« Older Article తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి