హైదరాబాద్‌లో భారీ వర్షం..
- June 05, 2023
హైదరాబాద్: మాడు పగిలే మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిన హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దాంతో వాతావరణం చల్లబడింది. నగరవాసులు కొంత రిలీఫ్ పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వాన పడింది. శేరిలింగం పల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది.
ఇక, తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కొమ్రుంభీం, మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట్, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వాన పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







