ఫార్మసీలకు కొత్త నిబంధన
- June 05, 2023
కువైట్: లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే ఫార్మసీకి కొత్త నిబంధనలు రూపొందించినట్లు ఆరోగ్య మంత్రి అహ్మద్ అల్-అవధీ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ఫార్మసీకి దాని సమీపంలోని ఏదైనా ఫార్మసీకి మధ్య దూరం అన్ని దిశలలో 200 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదని షరతులు విధించినట్లు, ఈ మేరకు మంత్రిత్వ నిర్ణయాన్ని జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మంత్రిత్వ శాఖ ఔషధ నియంత్రణ వ్యవస్థ దూరాన్ని లెక్కించి అవసరమైన నియంత్రణలను ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, ఈ నిర్ణయం నుంచి సహకార సంఘాలు, కమ్యూనిటీ హాస్పిటల్స్, కమ్యూనిటీ మెడికల్ సెంటర్లు, షాపింగ్ సెంటర్లు, మార్కెట్లలో ఉన్న ఫార్మసీలకు మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







