ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది..
- June 06, 2023
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. భారీ మైథలాజికల్ జానర్ మూవీగా రూపొందిన ఆదిపురుష్ లో ప్రభాస్ రాఘవగా నటిస్తుండగా కృతి సనన్ సీత గా అలానే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. భారీ స్థాయి అంచనాలు కలిగిన ఆదిపురుష్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ఆడియన్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచాయి. నేడు ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించింది యూనిట్.
ఇక కొద్దిసేపటి క్రితం ఆదిపురుష్ నుండి ఫైనల్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ ని పరిశీలిస్తే భారీ యాక్షన్, గ్రాండియర్ విజువల్స్ తో ఈ ట్రైలర్ రూపొందింది అని చెప్పాలి. ముఖ్యంగా పలు సీన్స్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు సినిమా చూడాలనే ఆసక్తిని మరింతగా పెంచుతాయి అని చెప్పాలి. ఇక ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో పాటు ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే వంటి వారి సీన్స్, వానర సైన్యం సీన్స్ ఎంతో బాగున్నాయి. మొత్తంగా ప్రస్తుతం ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ అయితే ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు విపరీతంగా పెంచేసింది అనే చెప్పాలి. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మిస్తుండగా దీనిని జూన్ 16న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి