అరేబియా సముద్రంలో తుఫాన్.. యూఏఈపై ప్రభావం ఉంటుందా?

- June 07, 2023 , by Maagulf
అరేబియా సముద్రంలో తుఫాన్.. యూఏఈపై ప్రభావం ఉంటుందా?

యూఏఈ: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఉష్ణమండల(ట్రోపికల్ ) తుఫాను యూఏఈపై ఎలాంటి  ప్రభావం చూపదని అధికార యంత్రాంగం తెలిపింది. వచ్చే వారం చివరిలో అరేబియా సముద్రానికి దక్షిణాన ఏర్పడే తుఫాన్  ప్రభావం ఉండదని జాతీయ వాతావరణ కేంద్రం ధృవీకరించింది.ఇది అరేబియా సముద్రం దక్షిణాన 11.9 ఉత్తర అక్షాంశం మరియు 66.00 రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉష్ణమండల అల్పపీడనంపై  NCM ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాన్ సమయంలో  గాలుల వేగం గంటకు 60 నుండి 90 కి.మీ వరకు ఉంటుందని NCM వివరించింది. "ప్రాంతీయ హరికేన్ పర్యవేక్షణ కేంద్రం జారీ చేసిన నివేదికల ద్వారా.. తుఫాన్  మరింత తీవ్రమవుతుంది.  రాబోయే 48 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుంది. దాని మార్గం అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా ఉంటుంది.  ఇక్కడ గాలి వేగం  గంటకు 90-120 కిమీ వేగంతో ఉంటుంది.  ఉష్ణమండల తుఫాను వేగం గంటకు 12 కిమీ కదులుతుంది.”అని ఎంసిఎ వెల్లండించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com