నవీ ముంబాయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ భూమిపూజ
- June 07, 2023ముంబై: ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవిస్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహా ప్రభుత్వం కేటాయించిన సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయానికి రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతం హరి సింఘానియా 60 నుంచి 75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ముంబాయి వాసుల సుదీర్ఘ కాల నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లలేని భక్తులకు నవీ ముంబాయిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని వెల్లడించారు. ఆలయం నిర్మాణంలో తమ వంతు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఉన్నమాదిరిగా నవీ ముంబాయిలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. పుష్కరిణీ, అలంకార మండపం, రథ మండపం, వాహన మండపం, మాఢ వీధులను నిర్మించి రెండు సంవత్సరాల్లో ఆలయాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మిలింద్ నర్వేకర్, అమోల్ కాలే, రాజేశ్ శర్మ, సౌరభ్ బోరా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం