WTC final2023: చరిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా

- June 07, 2023 , by Maagulf
WTC final2023: చరిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా

ఓవల్: చరిత్రాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 (wtc final) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ కండీషన్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ ఎంచుకున్నట్టు రోహిత్ తెలిపాడు. నలుగురు సీమర్స్, ఒక స్పిన్నర్ జడేజాతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. పిచ్ విషయానికి వస్తే.. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. పిచ్‌పై బంతి స్వింగ్ అయ్యే అవకాశాలున్నాయి. పిచ్‌పై పచ్చని పచ్చిక ఉంది. కాబట్టి సీమ్ కూడా లభించే ఛాన్స్ ఉంది. చక్కటి బౌన్స్ లభించనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

తుది జట్లు..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజ, లబుషేన్, స్టీవెన్ స్మిట్, ట్రావీస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్సీ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బొలాండ్.

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్ధూల్ థాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

కాగా ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ ట్రోఫీ దక్కించుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. గత సీజన్‌‌లో ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో టీమిండియా ట్రోఫీని కోల్పోయిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com