రువీ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి

- June 07, 2023 , by Maagulf
రువీ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి

మస్కట్: మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో రువీలోని పలు ప్రాంతాలు సోమవారం ఉదయం నుంచి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. రువీ బస్ స్టేషన్ ముందు మంగళవారం సాయంత్రం లోపాన్ని సరిచేసిన తరువాతనీటి సరఫరా ప్రారంభం కావడంతో  చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉపశమనం పొందాయి.  కాని రెక్స్ రోడ్ చుట్టూ ఉన్న చాలా ఇళ్లలో ఇప్పటికీ నీటి సరఫరా పునరుద్ధరణ కాక పోవడంతో నీటి కొరతతో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనీ కోరగా.. మరికొందరు తమ రోజువారీ పనుల కోసం సమీప ప్రాంతాలకు తరలివెళ్లారు. నీటి ఎద్దడి త్వరలోనే తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com