హీట్‌వేవ్‌తో పోరాడుతున్న బంగ్లాదేశ్ ప్రజలు
- June 07, 2023
బంగ్లాదేశ్: దక్షిణాసియాలో ఈ అర్థ శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలో చాల వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మరోవైపు అక్కడి ప్రజలను విద్యుత్ కోతలు మరింత కష్టాలకు గురి చేస్తున్నాయి. బాంగ్లాదేశ్ రాజధాని నగరం అయిన ఢాకాలో ఇప్పటికి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత తీవ్రమైన వేడి గాలులు చూడలేదని అక్కడి వాతావరణ శాఖ సీనియర్ అధికారి బజ్లూర్ రషీద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదివేల ప్రయిమరీ స్కూల్స్ ని మూసివేసింది. ఎండ వేడిమి కారణంగా ఎయిర్ కండీషనర్లు, ఫ్యాన్‌లకు చాలా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు బొగ్గును కొనుగోలు చేయలేక పోవడంతో బంగ్లాదేశ్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ పనులను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







