సూడాన్‌లో మూడు వందల మంది చిన్నారులను రక్షించిన యునిసెఫ్‌

- June 08, 2023 , by Maagulf
సూడాన్‌లో మూడు వందల మంది చిన్నారులను రక్షించిన యునిసెఫ్‌

సూడాన్‌: సూడాన్‌లో మిలటరీ, పారామిలటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో పెద్దవాళ్లే కాదు.. పసికందులు కూడా బలవుతున్నారు. గత నెల చివరల్లో సూడాన్‌ రాజధాని కార్టూమ్‌లో అల్‌- మైకోమా అనే ఓ అనాథాశ్రమంలో శిశువులకు తాగేందుకు పాలు లేక, తినడానికి తిండిలేక, పలు అనారోగ్య కారణాల వల్ల దాదాపు 70 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ఈ హృదయ విదారకర ఘటన అనంతరం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యునిసెఫ్‌ అక్కడున్న చిన్నారులను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా కార్టూమ్‌లోని అనాథశరణాలయంలో చిక్కుకున్న సుమారు 300 మంది శిశువులు, చిన్నారులను రక్షించినట్లు సహాయ అధికారులు గురువారం తెలిపారు. దీనిపై యునిసెఫ్‌ ప్రతినిధి రికార్డో పైర్స్‌ మాట్లాడుతూ.. 'గత నెల్లో అల్‌ మైకోమా అనాథాశ్రమంలో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన అనంతరం ఈ అనాథశరణాలయంలో ఉన్న దాదాపు మూడు వందల మంది చిన్నారులను ఈశాన్య ఆఫ్రికా దేశంలో సురక్షిత ప్రదేశానికి వారిని తరలించాము. అయితే చిన్నారులు సుదీర్ఘ ప్రయాణానంతరం కొత్త ప్రదేశానికి వెళ్లిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులు వారికి మెడికల్‌ చెకప్స్‌ చేశారు. ఇక ఆసుపత్రిలో చేరాల్సిన ఏ బిడ్డకైనా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది' అని ఆయన అన్నారు.

కాగా, సూడాన్‌లో మిలటరీ, పారామిలటరీ బలగాల మధ్య యుద్ధం ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి సూడాన్‌లో ప్రజల జీవన పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారులు పదుల సంఖ్యలో మృతి చెందారు. చనిపోయినవారిలో మూడు నెలల శివువులు కూడా ఉన్నట్లు మరణధృవీకరణ పత్రాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com