హైదరాబాద్: పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు..

- June 08, 2023 , by Maagulf
హైదరాబాద్: పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు..

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాధారణ పౌరులనే కాదు క్రిమినల్స్ ఆట కట్టించే పోలీసులను కూడా వదల్లేదు. ఏకంగా పోలీసులకే ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సోషల్ నెట్ వర్కింగ్ లోకి ప్రవేశించారు. ఫేస్ బుక్ పేజ్ ని హ్యాక్ చేసి బ్లూ ఫిలిమ్ ను అప్ లోడ్ చేశారు. ఫేస్ బుక్ పేజీల అశ్లీల చిత్రాలను చూసి పోలీసులు కంగుతిన్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి అప్ లోడ్ చేశారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సైబర్ క్రిమినల్స్ బరి తెగిస్తున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సైబర్ మోసాలు వెలుగుచూశాయి. ఇక, హైదరాబాద్ లో రోజుకొక సైబర్ నేరం వెలుగుచూస్తోంది. వీటికి అడ్డుకుట్ట వేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతలో.. పోలీసులకే షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు.

ఏకంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేయడమే కాకుండా అందులో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫేస్ బుక్ పేజీలోకి లాగిన్ అయిన పోలీసులు అందులో బూతు వీడియోలు చూసి ఒక్కసారిగా విస్తుపోయారు. ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. దాంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా పోలీసులు చైతన్యపరుస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సీపీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక ఫేస్ బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా ఖాతాల పేజీలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రజలకు అనేక నేరాలపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపేందుకు కృషి చేస్తున్నారు. అయితే, సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులకే ఝలక్ ఇచ్చారు. పోలీసుల ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి అందులో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com