జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర..
- June 10, 2023
జమ్మూకాశ్మీర్: పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూలై 1 నుంచి మొదలై.. ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 62 రోజుల పాటు సాగనున్న ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు జమ్మూకాశ్మీర్ యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత ఏప్రిల్ 17న ప్రారంభమైంది. యాత్రకు సంబంధించి J&K పరిపాలనా విభాగం కూడా అనేక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేశారు.
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







