ఇక పై ఆ తప్పు చేయనంటోన్న సాయి పల్లవి.!
- June 10, 2023
హీరోయిన్ల యందు సాయి పల్లవి వేరయా.! అంటే అతిశయోక్తి కాదేమో. ఏదో గ్లామర్ ఒలకబోసేసి, కమర్షియల్‌గా హిట్టు కొట్టేసి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయి స్టార్డమ్ తెచ్చుకోవాలనే టైప్ కాదు సాయి పల్లవి. తనకంటూ ఓ స్పెషల్ ఆంబియన్స్ వుంది. స్పెషల్ స్టార్డమ్ కూడా వుంది.
దాన్ని కాపాడుకునేందుకు ఆమె అస్సలు కక్కుర్తి పడదు. అందుకే రీమేక్ సినిమాల్లో నటించకూడదని పెట్టుకుంది. ఆ కారణంగానే చాలా సినిమాలు వదిలేసుకుంది కూడా.
‘భోళా శంకర్’ ఛాన్స్ అలా మిస్సయ్యిందే సాయి పల్లవికి. ఆ తప్పు ఆమెను వెంటాడుతూనే వుంది. దాంతో, సాయి పల్లవి రియలైజ్ అయ్యిందట. ఇకపై ఆ తప్పులు చేయనంటోంది.
రీమేక్ సినిమాలకైనా సై అంటోంది. సాయి పల్లవి డెసిషన్ మార్చుకోవడంతో, ఇప్పటికే ఓ రీమేక్ సినిమా సాయి పల్లవి తలుపు తట్టినట్లు తెలుస్తోంది.
సాయి పల్లవి తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్లీ ఆమె కెరీర్లో బిజీ అయిపోవడం ఖాయమే అని ఆమె అభిమానులు ఓ నిర్ఞయానికి వచ్చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









