‘దేశంలో అత్యుత్తమ పోలీసింగ్‌ మనదే’: మంత్రి హరీశ్ రావు

- June 10, 2023 , by Maagulf
‘దేశంలో అత్యుత్తమ పోలీసింగ్‌ మనదే’: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం, మాదాపూర్ జోన్ మియాపూర్ డివిజన్ లోని కొల్లూరు లో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ పోలీసులకు 2014 తరువాత అత్యాధునిక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పోలీసు యంత్రాంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి ఆధునీకరించారన్నారు. ఆధునిక పోలీసు భవనాలు, వాహనాలు, కొత్త టెక్నాలజీ పరికరాలు సమకూర్చడంతో రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని, శాంతిభద్రతలు నెలకొన్నాయని అన్నారు.
 
ఏ రాష్ట్రంలోనైతే శాంతిభద్రతలు బాగుంటాయో.. అక్కడ అత్యధికంగా పెట్టుబడులు వస్తాయని తద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ/ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థతో ప్రజలకు అందుబాటులో పోలిసింగ్ ఉందన్నారు. నేరాల నియంత్రణకు పోలీసింగ్‌ సేవలకు ఆధునికతను జోడించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

ఇప్పటివరకూ కొల్లూరు ప్రాంతం ఆర్ సిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉందని.. కొల్లూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 25వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లోకి సుమారు రెండు లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో కొల్లూరు నూతన పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. కొల్లూర్ పోలీస్ స్టేషన్ కి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా టి.సంజీవ్ కుమార్ నియమితులయ్యారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి,  సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మార్వో జయరాజ్, మియాపూర్ ఏసిపి  నరసింహారావు, కొల్లూరు ఇన్ స్పెక్టర్ టి సంజీవ్ కుమార్, మియాపూర్ ఇన్ స్పెక్టర్ తిరుపతిరావు, చందానగర్ ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి, ఆర్.సి పురం ఇన్ స్పెక్టర్ ప్రతాప్, చందానగర్ డిఐ పాలవెల్లి, ఆర్ సి పురం డిఐ ప్రతాప్, తెల్లాపూర్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ బి రాములు గౌడ్,తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్వర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ వి.రామ్ సింగ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కె మయూరి రాజు గౌడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ జి.జయలక్ష్మి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com