విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
- June 10, 2023
హైదరాబాద్: విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర అధికారులు వాహనాలు తనిఖీ చేశారు.
అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు.
వారు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో మరో డీఆర్ఐ బృందం తనిఖీలు చేపట్టింది. 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







