బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
- June 11, 2023
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ బర్త్ డే వేడుకలు బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ భారీ కేక్ కట్ చేసి , చిన్నారులకు కేక్ తినిపించి.. గిఫ్ట్స్ అందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన సిబ్బంది, వైద్యులు, రోగులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పుట్టిన రోజు వేడుకల తనకు బాధ్యతలను మరోసారి గుర్తు చేశాయని తెలిపారు. భూమ్మీద మహానుభావులు కొందరే ఉంటారని, తాము సమాజానికి ఎలా ఉపయోగపడతామా అని వారు ఆలోచిస్తారని చెప్పారు.
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి అని బాలయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా, నటుడిగా, ఆసుపత్రి వ్యవస్థాపకునిగా ఎన్టీఆర్ ఎన్నో గొప్ప పనులు చేశారని, వారి అడుగుజాడల్లోనే తాను నడవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తన తండ్రి పేద వారికి అందుబాటు ధరలలో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి ఎందరికో ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పధంతో సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ నిరంతరాయంగా ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తానని బాలయ్య ప్రకటించారు.
అటు, యూఎస్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో కూడా నందమూరి బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. అతి పెద్ద బిల్ బోర్డ్‌పై బాలకృష్ణ సినిమా సీన్స్.. ఫోటోలు ప్రదర్శించారు. ఆయన ఫోటోలు 24 గంటల పాటు ప్రదర్శనకు ఉంచారు. కేక్ కట్ చేసి.. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







