ఇస్తాంబుల్‌లో చారిత్రాత్మక మ్యాచుని వీక్షించిన యూఏఈ అధ్యక్షుడు
- June 11, 2023
యూఏఈ: ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ఫైనల్లో మిలాన్‌ను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 68వ నిమిషంలో రోడ్రీ చేసిన అద్భుతమైన గోల్‌తో మాంచెస్టర్ సిటీ చారిత్రాత్మక ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సహా అనేక మంది ప్రముఖులు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ ఒలింపిక్ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. షేక్ మొహమ్మద్‌తో పాటు యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి, మాంచెస్టర్ సిటీ యజమాని అయిన షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. షేక్ మన్సూర్ తర్వాత మాంచెస్టర్ సిటీ విజయంపై అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఆటగాళ్లతో సహా క్లబ్‌లోని ప్రతి ఒక్కరికి తన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







