మానవ అక్రమ రవాణాకు చెక్: బహ్రెయిన్-అమెరికా మధ్య ఒప్పందం
- June 11, 2023
బహ్రెయిన్: వ్యక్తుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ సంతకం చేశారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు విచారించడం కోసం కీలకమైన సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. దీంతోపాటు ఇది బాధితుల రక్షణ, సహాయాన్ని అందిస్తుంది. అదే సమయంలో శిక్షణ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సెమినార్లు మరియు వర్క్‌షాప్‌లు వ్యక్తుల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. అంతర్గత మంత్రి షేక్ రషీద్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్యటన సందర్భంగా సంతకం జరిగింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







