ఆరోగ్యానికి ఐదు సూత్రాలు.! ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకోండి మరి.!
- June 12, 2023ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. కానీ, ఆ ఆరోగ్యానికి ఎన్నో రకాల అనర్ధాలిప్పుడు. అందుకు కారణం అనూహ్యంగా మారిపోయిన లైఫ్ స్టైల్, ఆహార విధానాలే.
అయితే, వున్నంతలో ఆరోగ్యాన్ని మెరుగ్గా వుంచుకునేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం. వీలైతే తప్పకుండా పాటించేద్దాం.
1. కరివేపాకును చాలా చీప్‌గా చూస్తుంటాం. కూరల్లో కనిపిస్తే తీసి పారేస్తుంటాం. కానీ, కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచి, రక్థహీనతను తగ్గించడంలో చాలా తోడ్పడుతుంది.
2. సోంపు వాడకం చాలా మందికి తెలుసు. కానీ, తక్కువగా వాడుతుంటారు. సోంపు రెగ్యులర్‌గా వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటూ మలబద్ధకం సమస్య తీరుతుంది.
3. వేడి నీళ్లు దివ్యౌషధం. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా పరగడుపున ఓ గ్లాసుడు వేడి నీళ్లు తాగితే శరీరంలోని అనేక వ్యర్ధాలు తొలిగిపోయి మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.
4. పుల్లని పండ్లు తీసుకుంటే సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అతి తక్కువ ఖర్చులో లభించే నిమ్మకాయను రోజూ కనీసం ఓ చెక్క (ఏ రూపంలో అయినా) క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
5.వెల్లుల్లిని ఆహారంలో ప్రతీ రోజూ భాగం చేసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయ్.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?