ఇకపై పవన్ సినిమా షూటింగులన్నీ అక్కడే.!
- June 13, 2023
ఆంద్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ హోరు మొదలైంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల జోరులో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి చేయాల్సిన సినిమాల పరిస్థితేంటీ.? అంటే అందుకు ఓ పరిష్కారం చెబుతూ తాజా అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్.
హరీష్ శంకర్‌తో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఈ సినిమా షూటింగ్ ఏపీలోనే జరగనుందనీ ఆయన తెలిపారు.
ఆ సినిమా మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ నటించబోయే ‘ఓజీ’.. తదితర సినిమాల షూటింగులు కూడా ఏపీలోనే జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇకపై పవన్ కళ్యాణ్‌తో పాటూ, పలువురు హీరోల సినిమాలు సైతం ఏపీలో షూటింగులు జరిపేందుకు ముందుకొచ్చారని తెలుస్తోంది.
చూస్తుంటే, ఇకె నుంచీ టాలీవుడ్ ఏపీలో తిష్ట వేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల అందమైన పరిసరాలను తమ తమ కెమెరాల్లో బంధించి తెలుగు తెరపై ఆవిష్కరించేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ఆల్రెడీ తమ ప్రిపరేషన్లు స్టార్ట్ చేసేశారట.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







