వేసవిలో అంజీర్ పండు అంత ప్రమాదకరమా.?
- June 13, 2023
అంజీర్ పండు, అత్తి పండు, ఫిగ్స్.. ఇలా రకరకాల పేర్లతో పిలవబడే ఈ పండు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పచ్చిగా వున్న అంజీర్ పండునే కాదు, ఎండబెట్టిన అంజీర్‌ని సైతం ఆరోగ్యకరమైన చిరుతిండిగా తింటుంటారు చాలా మంది.
అయితే, అంజీర్‌ని వేసవిలో ఎక్కువగా తినడం అంత మంచిది కాదంటున్నారు. ఫ్రెష్‌గా వున్న అత్తి పండును తీసుకుంటే పెద్దగా ప్రమాదం లేదనీ, ఎండబెట్టి, ఎక్కువ రోజులు నిల్వ వుంచిన అంజీర్ పండుతోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంజీర్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయ్. సో సీజన్‌లో ఈ పండు తింటే ఎలాంటి సమస్య వుండదు. అలాగే, ఫైబర్ ఎక్కువగా వుండే ఈ పండులో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అధికంగా లభిస్తాయ్.
తద్వారా అజీర్తి సమస్యలు తదితర జీర్ణ సమస్యలు తలెత్తవు. అలాగే, ఏమైనా ఇన్‌ఫెక్షన్లుంటే తగ్గిపోతాయ్. వేసవిలో ఈ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ వుండవు. త్వరగా పాడయిపోతాయ్. అలా ఎక్కువ నిల్వ వున్న అత్తి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి వాంతులు, విరేచనాల వంటి సమస్యల బారిన పడే అవకాశముంది. అందుకే సమ్మర్‌లో ఈ పండ్లను మితంగా తింటే మంచిదని వైద్యుల సలహా.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







