తానా మహాసభలకు నటకిరీటీ డా.రాజేంద్రప్రసాద్
- June 13, 2023
అమెరికా: ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటులుగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్ నటుడిగానే కాకుండా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు. తన మాటలతో, హావభావాలతో ఆకట్టుకునే రాజేంద్రప్రసాద్ తానా మహాసభల్లో కూడా అందరినీ అలరించనున్నారు. ఎన్నో కార్యక్రమాలతో సంగీత విభావరులతో అలరించే తానా మహాసభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







