మళ్లీ మణిపూర్‌లో చెలరేగిన హింస.. 9 మంది మృతి

- June 14, 2023 , by Maagulf
మళ్లీ మణిపూర్‌లో చెలరేగిన హింస.. 9 మంది మృతి

ఇంఫాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్రరాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com