శ్రీలీలా.! నీకు నువ్వే సాటి సుమా.!

- June 14, 2023 , by Maagulf
శ్రీలీలా.! నీకు నువ్వే సాటి సుమా.!

కన్నడ కస్తూరి శ్రీ లీలను ప్రస్తుతం టాలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా అభివర్ణించొచ్చు. సీనియర్ హీరోలూ, జూనియర్ హీరోలూ అనే తేడా లేకుండా అందర్నీ కలిపి కొట్టేస్తోందీ అమ్మడు.

మహేష్ బాబు, బాలయ్య వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటూ, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలతోనూ ఆడి పాడేస్తోంది. అనిల్ రావిపూడి - బాలయ్య కాంబో మూవీలో బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. మిగిలిని వాటన్నింట్లోనూ శ్రీ లీల హీరోయిన్‌గానే నటిస్తోంది.

ఈ రోజు ఆమె బర్త్‌డే సందర్భంగా శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు.

చేతి నిండా ప్రాజెక్టులే కదా.. సోషల్ మీడియా మొత్తం శ్రీలీల తాజా లుక్స్‌తో నిండిపోయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శ్రీలీల మస్త్ ట్రెండింగ్ అయిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com