రౌడీతో ‘సీతారామం’ బ్యూటీ.! బుట్టబొమ్మని నెట్టేసిందిగా.!
- June 14, 2023
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఈ రోజు అనగా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.
కాగా, ఈ సినిమాలో తొలుత పూజా హెగ్దేని హీరోయిన్‌గా అనుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ, సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్దే తప్పుకుంది.
ఆ ప్లేస్‌లోకి ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. హీరోయిన్ పాత్ర చాలా హుందాగా, ప్రాధాన్యత సంతరించుకోదగ్గదిగా వుంటుందట ఈ సినిమాలో.
‘సీతారామం’ ఫేమ్‌తో ఆ పాత్రకు మృణాల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ లాస్ట్ మినిట్‌లో బుట్టబొమ్మని పక్కకు నెట్టేసి, మృణాల్ పేరును ప్రకటించేశారు.
అన్నట్లు రౌడీతో పరశురామ్ గతంలో ‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రకంగా చూస్తే ఈ కాంబో మూవీపై అంచనాలు బాగున్నాయ్.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







