జర భద్రం.! అందమైన జుట్టు కోసం అలా చేయొద్దు.!
- June 14, 2023
అమ్మాయిలకు అందం పొడవాటి కురులే. ఆ అందమైన కురులు ఆరోగ్యంగా వుంటేనే మరింత అందంగా వుంటుంది. మరి, జుట్టు ఆరోగ్యానికి ఏం చేస్తున్నాం.? ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు సంబంధిత సమస్యలు అనేకం అమ్మాయిలను వేధిస్తున్నాయ్. ఆ మాటకొస్తే, అబ్బాయిలు కూడా.
అయితే అమ్మాయిల్లో రకరకాల హెయిర్ స్టైల్స్ ఇష్టపడేవారు జుట్టు విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. గాఢత తక్కువగా వున్న షాంపూలు వినియోగించాలి.
ఏ షాంపూ అయినా డైరెక్ట్‌గా జుట్టుకు పట్టించకుండా, కాస్త డైల్యూట్ చేసి (వాటర్‌లో మిక్స్ చేసి) తలకు అప్లై చేయడం వల్ల కాస్తంతైనా గాఢత నుంచి కురుల్ని కాపాడుకునే అవకాశం వుంటుంది.
హెడ్ బాత్ తర్వాత తలకు వీలైనంతగా మాయిశ్చరైజర్ల వాడకం తగ్గిస్తే మంచిదని అంటున్నారు. వారంలో కనీసం రెండు సార్లయినా కొబ్బరి నూనెతో మర్దన చేస్తే అదే మంచి మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది.
హెయిర్ స్ర్టెయిట్‌నింగ్స్, కర్లింగ్ ఫోల్ట్స్.. వంటి వాటి కోసం హెయిర్ హీట్ ప్రొడక్ట్స్ వాడాల్సి వస్తుంది. అవి కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశాలున్నాయి. తరచూ వాటి జోలికి పోకుండా అప్పుడప్పుడూ అత్యవసర పరిస్థిుతుల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తే మంచిదని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







