కిడ్నాప్ అయిన విశాఖ ఎంపీ కుమారుడు, భార్య
- June 15, 2023
విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. గురువారం (జూన్ 14) ఉదయం ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవిలు కిడ్నాప్ కు గురి అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ నివాసంలోకి చొరబడి ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్ లను కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీ ఆడిటర్ జీవీని కూడా కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసును సాల్వ్ చేశారు. ముగ్గురిని సురక్షితంగా విడిపించారు.
ఈ కిడ్నాప్ కు పాల్పడింది ముగ్గురు అని పోలీసులు గుర్తించారు.రౌడీ షీటర్ హేమంత్ మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. 17 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఏలూరు వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురిని సురక్షితంగా విడిపించారు. కిడ్నాప్ లు జరిగిన అతి కొద్ది సమయంలోనే పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా గతంలో ఓ హత్య కేసులోను, కిడ్నాప్ కేసులోను నిందితుడుగా ఉన్న హేమంత్ ఈ కిడ్నాప్ లకు పాల్పడ్డాడని విశాఖ పోలీసులు తెలిపారు. మరి ఎంపీ కుమారుడిని, భార్యను, ఆడిటల్ జీవిని ఎందుకు కిడ్నాప్ చేశారు? డబ్బుల కోసమా? లేక ఈ కిడ్నాపుల వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







