ఆదిపురుష్.! ఏంటి ప్రబాస్ ఇలా చేస్తున్నావ్.!
- June 15, 2023
ప్రబాస్ ప్యాన్ ఇండియా హీరో కావడంతో, ప్రబాస్ నుంచి ఏ సినిమా వస్తుందన్నా ఆటోమెటిగ్గా బజ్ క్రియేట్ అయిపోతుంటుంది. అయితే, ‘ఆదిపురుష్’ పరిస్థితి వేరేలా వుంది.
ఈ సినిమాకి మొదట్నుంచీ నెగిటివిటీ వెంటాడుతోంది. ఎన్ని మార్పులు చేసినా సినిమాని పైకి లేవదీయలేకపోతున్నారు.
వార్తల్లో బిల్డప్ తప్ప.. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లలో ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రబాస్ కూడా ప్రమోషన్లలో కనిపించకపోవడం అభిమానుల్ని మరింత విస్మయానికి గురి చేస్తోంది.
అసలే సినిమాపై బజ్ లేదు. బడ్జెట్ చూస్తే తడిపి మోపెడయిపోయింది. అలాంటప్పుడు హీరోగా తన సినిమాని తనదైన స్టైల్‌లో ప్రమోట్ చేసుకునే బాధ్యత ప్రబాస్‌పై వుంది.
కానీ, ప్రబాస్ నుంచి ఆ వైబ్స్ ఏమీ కనిపించడం లేదు. మొన్న తిరుమలలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేసి చేతులు దులిపేసుకున్నారంతే.
రేపే అనగా జూన్ 16న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చూడాలి మరి, ఏం జరుగనుందో.!
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







