తమన్నా లస్ట్ స్టోరీస్.! ప్రమోషన్స్ పోలా.! అదిరిపోలా.!
- June 15, 2023
‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడల్ట్ సిరీస్‌గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ గురించి తెగ మాట్లాడుకున్నారంతా.
ఈ సిరీస్‌తోనే ‘భరత్’ భామ కైరా అద్వానీ బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. కాగా, ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీజన్‌లో సీనియర్ నటి కాజోల్‌తో సహా, మిల్కీ బ్యూటీ తమన్నా, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు.
త్వరలో ఓటీటీలో సందడి చేయబోతున్న ఈ సిరీస్‌ని కాస్త విభిన్నంగా ప్రమోట్ చేశారు. తమ తమ పాత్రలకు సంబంధించి ఆర్టిస్టులు స్ర్కిప్టు చదువుతూ వారి వారి హావభావాలను వ్యక్తీకరిస్తున్న వైనాన్ని ఓ వీడియో ద్వారా ఫన్నీగా చూపించారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అవుతోంది. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్ర్కిప్టులో మరీ ఎక్కువగా హాట్ సీన్స్ వున్నాయట. వాటిని కాస్త తగ్గించి టైట్ హగ్స్.. లాంటివేమైనా పెట్టొచ్చుగా.! అని తమన్నా డైరెక్టర్‌ని అడుగుతున్నట్లుగా వుంది.
అలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







