కియారా అద్వానీకి తొమ్మిదేళ్లు.!
- June 15, 2023
అవునండీ మీరు విన్నది నిజమే. హీరోయిన్‌గా కియారా అద్వానీ కెరీర్ స్టార్ట్ అయ్యి తొమ్మిదేళ్లు గడిచింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన కియారా తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమా సూపర్ హిట్. రెండో సినిమాకి రామ్ చరణ్‌తో జత కట్టింది కానీ, ఫెయిలైంది. ఇక్కడ ఫెయిలైనా, బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ కలిసొచ్చింది కియారాకి.
ప్రస్తుతం కియారా ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడే తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయా.? అంటూ సోషల్ మీడియా వేదికగా కియారా ఓ పోస్ట్ పెట్టింది.
ఇన్నేళ్లు తనను అభిమానించిన అభిమానులందరికీ, సపోర్ట్ చేసిన శ్రేయోభిలాషులకీ కియారా ఈ సందర్భంగా థాంక్స్ చెప్పింది.
తొమ్మిదేళ్లు గడిచినా నటనలో ఇంకా కొత్తగానే వుందని తెలిపింది. నటనలో మరింత పరిణీతి చెంది, మరింతగా మీ ఆదరాభిమానాలను అందుకుంటానని తెలిపింది. కియారా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







