రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ : అమరావతి
- May 13, 2016
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు.అలాగే 9 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కారాల కోసం 500 ప్రత్యేక రైళ్లు, 2000 కోచ్ లు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రవీంద్రగుప్తా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







