ఈ ఏడాది ఇరాన్‌వాసులకు హజ్‌యాత్ర లేనట్లే!
- May 13, 2016
ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రలో పాల్గొనడాన్ని ఈ ఏడాది నిలిపేసినట్లు ఇరాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని మక్కాను ముస్లింలు తమ జీవితకాలంలో ఒకసారైనా సందర్శించుకోవాలని ఆశిస్తారు. ఈ యాత్రకు ఏటా దేశదేశాల నుంచి లక్షలాది మంది హాజరవుతారు. అయితే ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న కారణంగా ఇరాన్ తమ దేశం నుంచి హజ్ యాత్రను నిలిపేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఏడాది హజ్ యాత్రలో ప్రమాదం జరిగి 2వేల మంది యాత్రికులు మృత్యువాతపడ్డారు. వారిలో 464 మంది ఇరాన్ వాసులు ఉన్నారు. దీంతో సౌదీలో లక్షలాది హజ్ యాత్రికుల భద్రతకు సంబంధించి ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇరాన్ వాసులకు హజ్‌యాత్ర కోసం అనుమతులు, రవాణా, వీసాలకు సంబంధించి సౌదీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ ఏడాది ఇరాన్‌వాసులకు హజ్‌యాత్ర ఉండదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అలీ జన్నతి మీడియాకు వెల్లడించారు. తాము చేయగలిగిందంతా చేశామని, సౌదీ నుంచి సానుకూల స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







