వారంలో 34,487 ట్రాఫిక్ ఉల్లంఘనలు..51 మంది యువకులు అరెస్ట్

- June 18, 2023 , by Maagulf
వారంలో 34,487 ట్రాఫిక్ ఉల్లంఘనలు..51 మంది యువకులు అరెస్ట్

కువైట్: కువైట్ ట్రాఫిక్ విభాగాలు గత వారం 34,487 ఉల్లంఘనలను నమోదు చేశాయి.  ఇందులో అత్యవసర సేవల ద్వారా జారీ చేయబడిన 966 ఉల్లంఘనలు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా వారి కుటుంబాల వాహనాలు నడుపుతున్న 51 మంది యువకులను కూడా అరెస్టు చేసింది. వారి గణాంకాల ప్రకారం.. అదే సమయంలో 1299 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రచారాల సందర్భంగా డ్రగ్స్ లేదా మద్యం సేవించిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాంటెడ్ కేసుల కోసం 315 మందిని కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేశారు. ప్రచారం సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 61 ద్విచక్ర వాహనాలతో సహా 97 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్ని డెలివరీ కార్మికులకు చెందినవి కూడా ఉన్నాయని ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com