ఖతార్ లో అభివృద్ధి చేసిన 15 బీచ్‌లు ప్రారంభం

- June 18, 2023 , by Maagulf
ఖతార్ లో అభివృద్ధి చేసిన 15 బీచ్‌లు ప్రారంభం

దోహా, ఖతార్: పర్యాటకులను ఆకర్షించేందుకు అభివృద్ధి చేసిన 15 బీచ్‌ల జాబితాను మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సందర్శకుల సౌకర్యం కోసం అనేక బీచ్‌లు పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తి సేవలతో వినోద సౌకర్యాలను అందజేస్తాయని తెలిపింది. అభివృద్ధి చెందిన బీచ్‌లలో ఫువైర్ట్ బీచ్, అల్ మరూనా బీచ్, అరిడా బీచ్, అల్ ఫెర్కియా బీచ్, సిమైస్మా బీచ్, అల్ వక్రా బీచ్, సీలైన్ బీచ్, అల్ అడైద్ బీచ్, అల్ మమ్లాహా బీచ్ (మహిళల కోసం), అల్ ఘరియా బీచ్, జిక్రిత్ బీచ్, దుఖాన్ బీచ్, ఉమ్ బాబ్ బీచ్, అల్ ఖరైజ్ బీచ్ (సింగిల్స్ కోసం) , సాల్వా బీచ్ ఉన్నాయి. లింక్‌లతో కూడిన బీచ్‌ల జాబితాను మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. పునరుద్ధరణ ప్రాజెక్ట్ కింద బీచ్‌లలో నడక మార్గాలు, విభిన్న డిజైన్ల షేడ్స్, శాశ్వత టాయిలెట్లు, కియోస్క్‌లు, బార్బెక్యూ ప్రాంతాలు, పిల్లల కోసం ఆట స్థలాలు, వాలీబాల్, ఫుట్‌బాల్ మైదానాలను ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ కూడా బీచ్‌లను సురక్షితంగా ఉంచడానికి సూచనలను జారీ చేసింది. సందర్శకులు నేరుగా ఇసుకపై మంటలు వేయవద్దని సూచించింది. నేరుగా బీచ్‌లలో మంటలు వేయడం వల్ల ఇసుక స్వభావం దెబ్బతింటుందని, ఇది పర్యావరణంపై ప్రభావం చూపుతుందన్నారు. మంత్రిత్వ శాఖ సందర్శకులను ఇసుకలో బొగ్గు బూడిదను పూడ్చకూడదని, నియమించబడిన చెత్త కంటైనర్లలో వ్యర్థాలను విసిరి పరిశుభ్రతను కాపాడుకోవాలని సూచించింది. సందర్శకులు తమ భద్రత కోసం సముద్రంలో ఈత కొట్టేటప్పుడు లైఫ్‌గార్డ్ జాకెట్లు ధరించాలని కూడా కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com